ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తాడో
Send us your feedback to audioarticles@vaarta.com
'హలో` సినిమాతో అఖిల్.. ప్రేక్షకులకు రోజుకొక సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ముందు టీజర్, ట్రైలర్లతో అలరించాడు. తర్వాత తను చేసే పాత్ర అంటూ అవినాష్‌గా పలకరించాడు. అమ్మ నాన్న అంటూ రమ్యకృష్ణ, జగపతి బాబులను పరిచయం చేస్తూ ఒక పిక్ ని రిలీజ్ చేసాడు.
ఆ నెక్ట్స్.. రిషిగా అజయ్ ని పరిచయం చేస్తూ ఒక పిక్ ని ట్విట్టర్ లో పెట్టాడు. ఇవన్నీ అభిమానులను అలరించాయి. సినిమాపై ఆసక్తిని పెంచాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున, అమల, సమంతలు కూడా తళుక్కుమని మెరవబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ట్రైలర్ లో చూపించిన యాక్షన్ సీక్వెన్సెస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన అఖిల్.. రిలీజ్ అయ్యే టైంకి ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఇస్తాడో చూడాలి.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. హలో.. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com