మంచు హీరోకి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని హీరో

  • IndiaGlitz, [Monday,June 06 2016]

మంచు ఫ్యామిలీ హీరో మ‌నోజ్ కి అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్..ఓ స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి..? ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏమిటి అనుకుంటున్నారా..? మంచు హీరో మనోజ్, ప్రణీత దంపతుల తొలి మ్యారేజ్ యానివర్సరీ కానుకగా అఖిల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని మ‌నోజ్ ట్విట్టర్ ద్వారా తెలియ‌చేసాడు.
మ‌నోజ్ అఖిల్ కు థ్యాంక్స్ చెబుతూ అఖిల్ ఇచ్చిన స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ పోస్ట్ చేసాడు. ఇంత‌కీ అఖిల్ ఇచ్చిన గిప్ట్ ఏమిటంటే... అఖిల్ దగ్గర ఎన్నో అరుదైన జాతుల పెట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటైన అలస్కన్ మాలామ్యూట్ ను మనోజ్ దంపతులకు ప్రెజెంట్ చేశాడు. నీలి కళ్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ బుజ్జి కుక్కపిల్లను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాను. దీనికి జోయా అని పేరు పెట్టుకున్నాని మ‌నోజ్ తెలియ‌చేసాడు.