హ్యాట్రిక్ కొట్టిన సంస్థలో అఖిల్ నాలుగో చిత్రం?
Send us your feedback to audioarticles@vaarta.com
‘శ్రీమంతుడు’ (2015),‘జనతా గ్యారేజ్’ (2016), ‘రంగస్థలం’ (2018) చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. అంతేగాకుండా.. ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్లతో ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మిస్తూ వార్తల్లో నిలుస్తోంది ఈ సంస్థ. ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజయం సాధించిన ఈ బ్యానర్లో యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ తన నాలుగో సినిమాను చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 'రంగస్థలం'తో మైత్రీ మూవీ మేకర్స్‌కు మరచిపోలేని విజయాన్ని అందించిన సుకుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్.. ఈ నెల 8న అఖిల్ పుట్టిన రోజుని పురస్కరించుకుని వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ తన మూడో చిత్రాన్ని ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు. అలాగే రాంగోపాల్ వర్మతోనూ ఓ సినిమా చేయబోతున్నారు.
కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి నాలుగో చిత్రంగా.. నాగ చైతన్య, చందూ మొండేటి కలయికలో ‘సవ్యసాచి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com