ప్రభాస్ బాటలో అఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణంరాజు నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌కి.. నాగార్జున నటవారసుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న అఖిల్‌కి హీరోలుగా చేసిన తొలి చిత్రాల విషయంలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నది పరిశీలకుల మాట. అదెలాగంటే.. ప్రభాస్, అఖిల్ ఎలాగైతే మూడక్షరాల పేర్లో.. వారి తొలి చిత్రాలైన 'ఈశ్వర్', 'అఖిల్' కూడా మూడక్షరాల పేర్లే. ఈ ఇద్దరి తొలి చిత్రాల డైరెక్టర్లు.. స్టార్ హీరోలతో బ్లాక్బస్టర్లను కొట్టిన నేపథ్యం ఉన్నవారే.
అయితే వీటిన్నింటికంటే అసలు పోలిక మరొకటుంది. అదేమిటంటే... ప్రభాస్ హీరోగా చేసిన మొదటి సినిమా 'ఈశ్వర్' (2002) నవంబర్ 11న రిలీజైతే.. అఖిల్ హీరోగా చేసిన ఫస్ట్ పిక్చర్ 'అఖిల్' కూడా 13 ఏళ్ల తరువాత అదే నవంబర్ 11న రాబోతోంది. 'ఈశ్వర్' యావరేజ్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది. 'అఖిల్' అంతకుమించి ఫలితం సాధిస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com