అఖిల్ చూపు ఆ సినిమా వైపు..

  • IndiaGlitz, [Friday,January 01 2016]

అక్కినేని అఖిల్ రెండ‌వ సినిమా ఎవ‌రితో ఉంటుంది..? ఎలాంటి సినిమా చేస్తార‌నే ఆస‌క్తి రోజురోజుకు పెరుగుతుంది. అఖిల్ రెండో సినిమాకి ఒక‌రిద్ద‌రి డైరెక్ట‌ర్స్ పేర్లు వినిపించినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌ర‌నేది ఫైన‌ల్ కాలేదు.

అయితే తాజాగా మ‌రో వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదేమిటంటే...హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన యే జ‌వానీ హై దివానీ సినిమా రీమేక్ లో అఖిల్ న‌టిస్తాడ‌ని. ర‌ణ‌బీర్ క‌పూర్, దీపికా ప‌డుకునే జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని అయ‌న్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించారు. క‌ర‌ణ్ జోహా్ర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అఖిల్ హీరోగా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్, అన్న‌పూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. సంక్రాంతి త‌రువాత ఈ సినిమాని ప్రారంభిస్తార‌ట‌. మ‌రి...ఇది నిజ‌మో..కాదో..తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.