అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్సయ్యింది.....
- IndiaGlitz, [Thursday,September 08 2016]
అక్కినేని నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్‌లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై నాగార్జున కూడా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నాగచైతన్య పెళ్ళి గురించి చెబుతూ చైతు ఎప్పుడంటే అప్పుడు నిశ్చితార్థం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అలాగే రెండో కుమారుడు అఖిల్ నిశ్చితార్థం మాత్రం డిసెంబర్ 9న జరగనుందని క్లారిటీ ఇచ్చేశాడు కింగ్. దాదాపు అఖిల్ పెళ్ళి వచ్చే ఏడాది జరగనుందన్నమాట.