అఖిల్ ఎంగేజ్ మెంట్ కార్డ్ వచ్చేసింది..!
- IndiaGlitz, [Tuesday,November 01 2016]
అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమలో పడడం, త్వరలో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకోవడం ఓ సంచలనం అనుకుంటున్న తరుణంలో అఖిల్ నేను ప్రేమిస్తున్నాను అంటూ అందరికి షాక్ ఇచ్చాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మనవరాలు శ్రేయ భూపాల్ తో అఖిల్ ప్రేమలో పడిన విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్ డిసెంబర్ 9న జరగనున్నట్టు గతంలో నాగార్జున ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ న్యూస్ ను కన్ ఫర్మ్ చేసేలా అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్ కార్డ్ బయటకు వచ్చింది.
ఇందులో డిసెంబర్ 9న శుక్రవారం రాత్రి 7 గంటలకు జి.వి.కె ఇంట్లో ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనున్నట్టు తెలియచేసారు. శ్రీమతి అన్నపూర్ణ, అక్కినేని నాగేశ్వరరావు ఆశీస్సులతో అంటూ కార్డ్ బిగినింగ్ లో ఉంటే....లాస్ట్ లో అమల, నాగార్జున అక్కినేని అని రాసారు. ఇక అఖిల్ పెళ్లి ఇటలీలో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైతన్య కంటే ముందు అఖిల్ పెళ్లి జరగబోతుండడం విశేషం..!