'అఖిల్' టైటిల్ అఖిల్ కి నచ్చలేదట...

  • IndiaGlitz, [Friday,September 25 2015]

అక్కినేని వంశం నుంచి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న యువ కెర‌టం అఖిల్. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ డైరెక్ష‌న్ లో నితిన్ ఈ సినిమాని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 22న అఖిల్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే అఖిల్ ఫ‌స్ట్ మూవీ టైటిల్ విష‌య‌యంలో మిస్పైల్, తాండ‌వం, బాల‌రాజు..ఇలా కొన్ని టైటిల్స్ అనుకున్నారు.

కానీ ఫైన‌ల్ గా అఖిల్ పిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఫ‌స్ట్ మూవీకి మీ పేరే టైటిల్ గా పెట్ట‌డానికి కారణం ఏమిట‌ని అఖిల్ ని అడిగితే...ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు అఖిల్. అయిన‌ప్ప‌టికీ సినిమాకి నా పేరే టైటిల్ గా పెట్ట‌డం నాకు న‌చ్చ‌లేదు. ఎందుకంటే మ‌రీ... ఓవ‌ర్ గా ఉంటుంద‌నిపించింది. కాక‌పోతే సుధాక‌ర్ రెడ్డిగారు, వినాయ‌క్ గారు న‌న్ను క‌న్విన్స్ చేసి ఫిక్స్ చేసారంటున్నాడు అఖిల్.