అది కన్ ఫర్మ్ కాలేదంటున్న అఖిల్..
- IndiaGlitz, [Saturday,December 12 2015]
అక్కినేని అఖిల్...నటించిన తొలి చిత్రం అఖిల్ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అఖిల్ సినిమా ప్లాప్ అయినా అఖిల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అయితే అఖిల్ నటించే రెండో సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉంటుందని...ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తారని ప్రచారం జరుగుతుంది.
అలాగే లోఫర్ రిజెల్ట్ ను బట్టి పూరి డైరెక్షన్ లో చేయాలా..? వద్దా... అనేది ఫైనల్ చేస్తారని మరో వాదన. అయితే ఈ విషయాల పై అఖిల్ ట్విట్టర్ లో స్పందిస్తూ...ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ప్రస్తుతం రెండో సినిమా గురించి ఆలోచిస్తున్నాను. ఇలాంటి సమయంలో ఓపికగా ఉండడం చాలా ముఖ్యం అని తెలుసుకున్నాను అంటున్నాడు. మరి...తొలి చిత్రంతో విజయం సాధించలేకపోయిన అఖిల్...మలి చిత్రంతో సంచలన విజయం సాధిస్తాడని ఆశిద్దాం.