ఐఫా వేడుకలో అఖిల్ డాన్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియాలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అవార్డ్స్ ఫంక్షన్ ఐఫా అవార్డ్స్ ఫంక్షన్. ఈ సంవత్సరం నుంచి ఐఫా వేడుకలో సౌత్ సినిమాలకు కూడా అవార్డ్స్ ఇవ్వనున్నారు. ఐఫా అంటే ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ.
ఈనెల 5,6 తేదీల్లో హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగే ఐఫా వేడుకకి అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ వేడుకలో తెలుగు అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగే రోజు అక్కినేని అఖిల్ డాన్స్ పర్ ఫార్మెన్స్ ఇవ్వనుండడం విశేషం. అఖిల్ మూవీతో పరిచయమైన అఖిల్ డాన్స్ లతో అదరగొట్టాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అఖిల్ ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ లో చేసే డాన్స్ పర్ ఫార్మెన్స్ కోసం కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో రిహార్సల్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com