పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన అఖిల్..
- IndiaGlitz, [Saturday,July 16 2016]
నాగ చైతన్య, సమంత లవ్ లో ఉన్నారని ఓ పక్క ప్రచారం జరుగుతుంటే...ఎవరూ ఊహించని విధంగా అఖిల్ నేను ప్రేమలో పడ్డాను అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ఫ్రెండ్ శ్రేయా భూపాల్ ని ప్రేమిస్తున్నట్టు అఖిల్ చెప్పడంతో ఫ్యాన్సే కాదు...సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. అప్పుడే అఖిల్ కి పెళ్లా..అని ఆశ్చర్యపోతూ సైమా ఫంక్షన్ లో అందరి ముందు రానా, లక్ష్మీ మంచు అఖిల్ ని అడగడం కూడా జరిగింది.
ఇదిలా ఉంటే...తాజాగా అఖిల్ తన పెళ్లి గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ....ఎంగేజ్ మెంట్ త్వరలో జరగచ్చేమో కానీ...నాన్న మరియు సన్నిహితులు, స్నేహితుల సలహా మేరకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదు అని పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసాడు. అఖిల్ రెండో సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం.