గెస్ట్ రోల్ గురించి క్లారిటీ ఇచ్చిన అఖిల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటిస్తున్న చిత్రం ఆటాడుకుందాం...రా. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో అక్కినేని అఖిల్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. ఆటాడుకుందాం...రా అనే టైటిల్ సాంగ్ లో అఖిల్ కనిపించనున్నాడు. నిన్న అఖిల్ పై ఈ సాంగ్ ను శేఖర్ నృత్య దర్శకత్వంలో అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో చిత్రీకరించారు.
గెస్ట్ రోల్ చేయడం గురించి అఖిల్ మాట్లాడుతూ....చిన్నప్పుడు నా సిసింద్రీ సినిమాలో సాంగ్ ఆటాడుకుందాం..రా అనేది. ఇప్పుడు సుశాంత్ ఆటాడుకుందాం..రా టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఆ విధంగా ఈ సినిమాతో నాకు కనెక్షన్ ఉంది. అందుకే ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ మూవీలో ఈ సాంగ్ చేస్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమాతో పండగ మొదలవుతుంది అంటూ గెస్ట్ రోల్ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ ఇచ్చారు అఖిల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments