గర్ల్ ఫ్రెండ్ తో ఫస్ట్ టైమ్ కెమెరాకి చిక్కిన అఖిల్..!

  • IndiaGlitz, [Saturday,August 27 2016]

అక్కినేని అఖిల్, జి.వి.కె మ‌న‌వ‌రాలు శ్రేయా భూపాల్ తో ప్రేమ‌లో ప‌డ్డాడు అంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే...వీరిద్ద‌రూ క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఫ‌స్ట్ టైమ్ అఖిల్ త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ శ్రేయా భూపాల్ తో క‌లిసి కెమెరాకి చిక్కాడు.
అది ఎక్క‌డంటే.... టి.సుబ్బిరామిరెడ్డి చెల్లెలు కొడుకు, నిమ్మ‌గ‌డ్డ కూతురు స్వాతిని పెళ్లి చేసుకున్న సంద‌ర్భంగా శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ లో ఇచ్చిన పార్టీ లో అఖిల్, త‌న ప్రియురాలితో క‌లిసి దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ ఫోటోలో అఖిల్, శ్రేయా భూపాల్ తో పాటు మోడ‌ల్ శిల్పారెడ్డి, మంచు ల‌క్ష్మి కూడా ఉన్నారు. అఖిల్ ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రాగానే ఈ విష‌యం పై నాగార్జున స్పందిస్తూ...చైత‌న్య‌, అఖిల్ పెళ్లి విష‌యంలో నిర్ణ‌యం వారిదే అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేసారు. అయితే..చైత‌న్య‌, అఖిల్ పెళ్లిల్లు ఒకేసారి జ‌రుగుతాయి అని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెడుతూ....ఇద్ద‌రి పెళ్లిళ్లు వేరువేరుగా జ‌రుగుతాయని నాగ్ ప్ర‌క‌టించారు. చైత‌న్య‌, అఖిల్ మ్యారేజెస్ గురించి నాగార్జున త్వ‌ర‌లో ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

More News

న‌వీన్ చంద్ర హీరోగా వేణుమూవీస్ సంస్థ కొత్త చిత్రం ప్రారంభం

రెండు ద‌శాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన వేణుమూవీస్ నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించింది. పసుపులేటి శ్రీనివాస‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో న‌వీన్ చంద్ర హీరోగా జి.గోపి ద‌ర్శ‌క‌త్వంలో వేణుమాధ‌వ్ నిర్మాత‌గా రూపొందుతున్న కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది.

తదుప‌రి చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన కొర‌టాల‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కించిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ చేస్తుంది.

సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా మలినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది.

తమన్నాకు పాట పాడుతున్న శృతి...

శృతిహాసన్ హీరోయినే కాదు,మంచి సింగర్ కూడా.వీలున్నప్పుడల్లా సినిమాల్లో పాట పాడుతుంటుంది.

పిచ్చి ప్రేమ అంటే ఏమిటో చూపిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

త‌మ అభిమాన హీరో మీద ఒక్కొక్క‌రు ఒక్కొళా త‌మ అభిమానాన్ని చూపిస్తుంటారు. కొంత మంది అయితే...త‌మ హీరోను ఎంత‌గా అభిమానిస్తున్నామో  చూపించేందుకు కొత్త‌గా ఏదొటి చేస్తుంటారు.