గర్ల్ ఫ్రెండ్ తో ఫస్ట్ టైమ్ కెమెరాకి చిక్కిన అఖిల్..!
- IndiaGlitz, [Saturday,August 27 2016]
అక్కినేని అఖిల్, జి.వి.కె మనవరాలు శ్రేయా భూపాల్ తో ప్రేమలో పడ్డాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే...వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. ఫస్ట్ టైమ్ అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ శ్రేయా భూపాల్ తో కలిసి కెమెరాకి చిక్కాడు.
అది ఎక్కడంటే.... టి.సుబ్బిరామిరెడ్డి చెల్లెలు కొడుకు, నిమ్మగడ్డ కూతురు స్వాతిని పెళ్లి చేసుకున్న సందర్భంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో ఇచ్చిన పార్టీ లో అఖిల్, తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటోలో అఖిల్, శ్రేయా భూపాల్ తో పాటు మోడల్ శిల్పారెడ్డి, మంచు లక్ష్మి కూడా ఉన్నారు. అఖిల్ ప్రేమ వ్యవహారం బయటకు రాగానే ఈ విషయం పై నాగార్జున స్పందిస్తూ...చైతన్య, అఖిల్ పెళ్లి విషయంలో నిర్ణయం వారిదే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని చెప్పకనే చెప్పేసారు. అయితే..చైతన్య, అఖిల్ పెళ్లిల్లు ఒకేసారి జరుగుతాయి అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ....ఇద్దరి పెళ్లిళ్లు వేరువేరుగా జరుగుతాయని నాగ్ ప్రకటించారు. చైతన్య, అఖిల్ మ్యారేజెస్ గురించి నాగార్జున త్వరలో ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.