'అఖిల్' ఆడియో ఆవిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ అక్కినేని, సయేషా సైగల్ హీరో హీరోయిన్లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్ నితిన్ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్'. అనూప్ రూబెన్స్, ఎస్.ఎస్.థమన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున, మహేష్‌బాబు ఆవిష్కరించారు. ఆడియో సీడీలను అక్కినేని నాగార్జున ఆవిష్కరించారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ `అఖిల్ ను అందరూ తమ బిడ్డలా భావించి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. కృష్ణగారితో 'వారసుడు' సినిమా చేశాను. ఇప్పుడు కృష్ణగారి వారసుడు నా వారసుడు సినిమా ఆడియో లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇలా ఒక హీరోను ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మహేష్‌కి థాంక్స్. అభిమానులతో అనుబంధం 75 ఏళ్ళ క్రితమే మొదలైంది. అది పెరుగుతూ, పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అఖిల్‌ను సునామీ కెరటంపై మోసుకెళ్తున్నారు. నాన్నగారు ఎప్పుడూ నాతోనే అభిమానుల కేకల్లో, ఆనందంలో ఉంటారు. సయేషాకి ఆల్ ది బెస్ట్. నితిన్, సుధాకర్‌రెడ్డిగారికి, టీంకి థాంక్స్. దశమి అంటేనే విజయం. ఈ సంవత్సరం విజయదశమి కానుకగా సినిమా అక్టోబర్ 22న విడుదలవుతుంది'' అన్నారు.
మహేష్ మాట్లాడుతూ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్. ''అఖిల్‌కి ముందుగానే కంగ్రాట్స్. సాంగ్స్ లో, ట్రైలర్స్ లో అఖిల్ టెరిఫిక్ గా కనపడతున్నాడు. ఒక హీరోను స్క్రీన్ ప్రెజంట్ చేయడంలో ఎవరైనా వినాయక్‌గారి తర్వాతే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో పెద్ద హీరోని ఇచ్చినందుకు వినాయక్‌గారికి థాంక్స్. వినాయక్, నితిన్‌కి ఆల్ ది బెస్ట్. ఎ.ఎన్.ఆర్. లివ్స్ ఆన్. ఈరోజు అక్కినేని నాగేశ్వరావుగారు చాలా హ్యపీగా ఉండుంటారు. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ ''నా లాంచింగ్ రోజే నేను చెప్పేశాను. నేను నా లాంచింగ్ మూవీ గురించి ఆలోచిస్తున్ననప్పుడు చీకటిలో టార్చ్ లైట్‌గా వినాయక్‌గారు కనపడ్డారు. నన్ను హీరోగా కంటే కొడుకులా, ఫ్రెండ్‌లా చూసుకుంటారు. ఎరోజు టెన్షన్ ను నా పేస్ పై కనపడనీయలేదు. ఆయన నాతో మరో సినిమా చేస్తారని మాట ఇచ్చారు. అనూప్, థమన్‌లకు చాలా థాంక్స్. వినాయక్ గారి సినిమాలన్నీ ఒకలా ఉంటే ఈ సినిమాలో అమోల్ రాథోడ్‌గారు ఒక కొత్త యాంగిల్లో చూపించారు. నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్.
ఈ సినిమా కోసం నేను పడ్డ కష్టం కంటే నా చుట్టూ ఉన్నవారు పడ్డ కష్టమే ఎక్కువ. ఈ సినిమాకి వినాయక్ గారు గుండె అయితే, సుధాకర్ రెడ్డిగారు బ్యాక్ బోన్ లా నిలబడ్డారు. వారిపై కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేశాను. వారికి స్పెషల్ థాంక్స్. కోనవెంకట్, వెలిగొండ శ్రీనివాస్‌కి, సయేషాకి థాంక్స్. చైతు అన్నకి థాంక్స్. నితిన్ నా కాలర్ పట్టుకుని ఈ సినిమా చేయించాడు. ఇంత మంచి సినిమాని వదులుకుంటావా, నీకేమైనా పిచ్చా, నీ అభిమానులకు హిట్ ఇవ్వు అని ఈ సినిమాని నిర్మాతగా దగ్గరుండి చేయించాడు. నా తల్లిదండ్రులు, అన్నయ్యతో నా తొలి సినిమా ఆడియో రిలీజ్ చేయించాలని కల ఉండేది. అది ఈరోజుతో నిజమైంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ''అఖిల్ లాంచింగ్ రోజున ఈ సినిమా పెద్ద సెన్సేషనల్ హిట్ అవుతుందని నేను నాగార్జునగారికి ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్‌ను హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకున్నానని నమ్ముతున్నాను. రేపు ఆ విషయం ప్రేక్షకులు కూడా నమ్ముతారు. అయితే సినిమా తీసిన దర్శకుడిగా చెబుతున్నాను. అఖిల్ కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. టీం ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. నితిన్, సపోర్ట్ చేసిన వారికి అందరికీ థాంక్స్`` అన్నారు.
నిర్మాత నితిన్ మాట్లాడుతూ ''నాగార్జునగారు నిర్మాతగా నన్ను, మా బ్యానర్ ను నమ్మి పెద్ద లెగసీ ఉన్న అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అఖిల్ ను అప్పగించారు. అఖిల్ మూవీ అనగానే నితిన్ లక్ చాన్స్ కొట్టాడురా అని చాలా మంది అనుకున్నారు. కానీ హిట్ సినిమా చేస్తామని నాగార్జునగారికి మాట ఇచ్చాం, ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎంత టెన్షన్ పడ్డామో నాకు, వినాయక్‌గారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ ప్రామిస్‌ను నిలబెట్టుకున్నామని నమ్మకంతో ఉన్నాం. నేను మొత్తం సినిమా చూశాను. దాని గురించి ఇప్పుడే మాట్లాడను. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. అనూప్, థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అఖిల్‌కి ఉన్న మెచ్యూరిటీ లెవల్స్, కాన్ఫిడెన్స్ ఏ డెబ్యూ హీరోలో చూడలేదు. తన హార్డ్‌వర్క్, డేడికేషన్ టీమ్ అందరికీ తెలుసు. అదే తనని హై రేంజ్ తీసుకెళుతుంది. అక్కినేని నాగేశ్వరరావుగారు ఆశీస్సులతో, అభిమానులు కోరికతో, మా టీం పడ్డ కష్టంతో సినిమా పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ `తమ్ముడు 'సిసింద్రీ'లో పాక్కుంటూనే హిట్ ఇచ్చాడు. 'మనం' సినిమాలో ముప్పై సెకండ్లు పాటు చిన్న వాక్ ఇస్తే సినిమా పెద్ద హిట్టయింది. ఇప్పుడు 'అఖిల్' సినిమాతో అందరూ ఇండస్ట్రీలో ఏమేం చేయలేకపోయాడో, దాన్ని తను చేసి చూపిస్తాడు. అఖిల్ ఆల్ ది బెస్ట్ కంటే ముందు కంగ్రాట్స్ చెప్పాలి. 'సిసింద్రీ', 'మనం' సినిమా తర్వాత వస్తున్న 'అఖిల్'తో హ్యట్రిక్ కొడతాడు. అనూప్, థమన్ మంచి మ్యూజిక్‌నిచ్చారు. అక్టోబర్‌లో అన్నీ పండుగలను పక్కనపెట్టి 'అఖిల్' సినిమాతో పండుగ చేసుకోవడం పక్కా'' అన్నారు.
సయేషా సైగల్ మాట్లాడుతూ ''అఖిల్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. తను మంచి కోస్టార్. ఫస్ట్ మూవీని వినాయక్‌గారి దర్శకత్వంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.
సుమంత్ మాట్లాడుతూ ''తాతగారి పుట్టినరోజున అఖిల్ ఆడియో రిలీజ్ కావడం చాలా హ్యపీగాూండేది. ఆయన ఆశీస్సులు ఉంటాయి. తాతగారికి మహేష్ అంటే చాలా ఇష్టం. ఈ ఆడియోకి మహేష్ వచ్చి అఖిల్‌ను ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అఖిల్ అండ్ టీంకి ఆల్ ది బెస్ట్'' అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ ''రాజమౌళిగారు 'బాహుబలి'తో టాలీవుడ్ మూవీని హలీవుడ్‌కి తీసుకెళితే, వినాయక్‌గారు ఈ చిత్రంతో హలీవుడ్ హీరోను టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారు. నేను అఖిల్ చేసిన డ్యాన్సులు చూసి థ్రిల్ అయ్యాను. అక్టోబర్ 22న అక్కినేని అభిమానులు దసరా, దీపావళి, సంక్రాంతి అన్నీ పండగలను ఒకేసారి సెలబ్రేట్ చేసుకుంటారు. నితిన్, వినాయక్ అండ్ టీంకి ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నాగసుశీల మాట్లాడుతూ `అఖిల్ విల్ రాక్. వినాయక్ అండ్ టీంకి ఆల్ ది బెస్ట్'' అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ `అఖిల్ ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలేదు. వినాయక్ డైరెక్షన్ లో, నితిన్ ప్రొడ్యూసర్ గా సినిమా చేయడమనేది చాలా మంచి విషయం. ఈ సినిమాని నేను తమిళ్లో రిలీజ్ చేస్తున్నాను. అఖిల్ హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ ప్రసాద్, మహేష్ రెడ్డి, రఘురామరాజు, ప్రసాద్ వి.పొట్లూరి, బెల్లంకొండ సురేష్, సుశాంత్, కొరటాల శివ తదితరులు పాల్గొని యూనిట్ ను అభినందించారు.
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతోపాటు లండన్‌కు చెందిన లెబాగా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout