డల్లాస్ లో 'అఖిల్' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Sunday,September 27 2015]

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్‌ నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అఖిల్‌'. ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 25 నుంచి అమెరికాలోని మూడు ప్రాంతాల్లో 'అఖిల్‌' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు డల్లాస్‌లో ఎంతో మంది అభిమానులు, ప్రముఖులు, చిత్ర యూనిట్‌ సభ్యుల మధ్య ఆడియో రిలీజ్‌ ఎంతో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల్‌ అక్కినేని, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత ఎన్‌.సుధాకర్‌రెడ్డి, రచయిత కృష్ణచైతన్యలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత నితిన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

More News

'కొలంబస్' గా రెడీ అవుతున్న సుమంత్ అశ్విన్

లవర్స్,కేరింత..ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం 'కొలంబస్'.

మహేష్ ... మాట తప్పలేదు...

'శ్రీమంతుడు' సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత తీసున్నట్లే హీరో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

రజనీకాంత్ రిలీజ్ డేట్ ఫిక్సయింది...

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పారంజిత్ దర్శకత్వంలో 'కబాలి'అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

'హరికథ' కాన్సెప్ట్ అదేనట...

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'శివమ్'విడుదల్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే 'హరికథ'చిత్రంపై ఫుల్ కాన్ సన్ ట్రేషన్ చేయబోతున్నాడు.

శానిఫ్రాన్సిస్కోలో 'అఖిల్' ఆడియో విడుదల

మహానటుడు అక్కినేని మనవడు,కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో