భారీ రేటుకు అఖిల్ ఆడియో ప్రసార హక్కులు
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని వంశం మూడోతరం నుంచి వస్తున్న మరో సంచలన యువ కథానాయకుడు అఖిల్. తొలి సినిమాకే అఖిల్ స్టార్ హీరో రేంజ్ లో బిజినెస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇక అఖిల్ ఆడియో ఫంక్షన్ ప్రసార హక్కుల కోసం కొన్ని న్యూస్ ఛానల్స్ పోటీ పడినప్పటికీ... టీ.వి. 5 భారీ రేటుకి ప్రసార హక్కులను కైవసం చేసుకుంది.
గతంలో...బాహుబలి చిత్రం ఆడియో ఫంక్షన్ ప్రసార హక్కులను కూడా టీ.వి 5 భారీ రేటుకు కొన్న విషయం తెలిసందే. ఆడియో ఫంక్షన్ ప్రసార హక్కులను ఓ న్యూస్ ఛానల్, ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ కి ఇస్తారు. కానీ టీ.వి.5 ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లేకుండా భారీ రేటు ఇచ్చి అఖిల్ తొలి చిత్రం ఆడియో ప్రసార హక్కులను దక్కించుకోవడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు అఖిల్ కి క్రేజు...ఏ రేంజ్ లో ఉందో.
టీ.వి 5 బాహుబలి ఆడియో ఫంక్షన్ ప్రసారం చేసింది. ఆ సినిమా ఎంతటి సంచలనం స్రుష్టించిందో తెలిసిందే. మరి..అఖిల్ సినిమా ఆడియోను కూడా టీవి 5 ప్రసారం చేస్తుంది. ఈ సినిమా ఎంతటి సంచలనం స్రుష్టిస్తుందో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments