మరోసారి లవర్ బాయ్‌గా అఖిల్?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా రెండు సినిమాల్లో నటించినా.. అవి కెరీర్ పరంగా ఏ మాత్రం సాయపడలేక పోయాయి. తొలి చిత్రం 'అఖిల్' కెరీర్లోనే డిజాస్టర్‌గా మిగలగా.. రెండో చిత్రం 'హలో'కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సందడి చేయలేకపోయింది. దీంతో మూడో సినిమా అయినా కెరీర్‌కు ప్లస్ అయ్యేవిధంగా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు ఈ అక్కినేని వారసుడు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు విన్నా.. ఏది ఫైనల్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ ఓ కథకు ఓకే చెప్పారని తెలిసింది. కాస్త వివరాల్లోకి వెళితే.. ఇటీవల 'తొలి ప్రేమ'తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరితో అఖిల్ తదుపరి చిత్రం చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న వెంకీ.. ఈ చిత్రాన్ని కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారట. ఇందుకోసం అఖిల్‌ను లవర్ బాయ్‌గా స్టైలిష్ లుక్‌లో చూపించబోతున్నట్టు సమాచారం. 'తొలిప్రేమ' నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. అలాగే 'తొలిప్రేమ'కు స్వరాలను అందించిన తమన్ ఈ చిత్రానికి కూడా సంగీతమందించనున్నారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com