రెండో సినిమాని ఎనౌన్స్ చేసిన అఖిల్..

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

అక్కినేని అఖిల్ తొలి చిత్రంతో ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో...అభిమానులు అఖిల్ రెండో సినిమా పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే...అఖిల్ రెండో సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. కానీ...ఈ వార్త‌ల పై నాగార్జున కానీ అఖిల్ కానీ స్పందించ‌లేదు. ఇదిలా ఉంటే....
అఖిల్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న రెండో సినిమాని ప్ర‌క‌టించాడు. అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రెండో సినిమాని చేయ‌నున్నాను. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. దాదాపు స్ర్కిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ను తెలియ‌చేస్తాను అంటూ అఖిల్ ట్వీట్ చేసాడు. ఈ మూవీ ఆగ‌ష్టులో సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.