ఒకే హీరోయిన్ తో అఖిల్ - నితిన్..!

  • IndiaGlitz, [Saturday,November 19 2016]

అఖిల్ - నితిన్...ఈ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అనే విష‌యం తెలిసిందే. అఖిల్ రెండో సినిమాను మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌ను డిసెంబ‌ర్ లో ప్రారంభించి రెగ్యుల‌ర్ షూటింగ్ ను జ‌న‌వ‌రి నుంచి స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీలో అఖిల్ స‌ర‌స‌న హీరోయిన్ గా కొత్త అమ్మాయితే బాగుంటుంది అని విక్ర‌మ్ కుమార్ ఆలోచ‌న‌. త‌మిళ్ లో ధ‌నుష్ స‌ర‌స‌న న‌టిస్తున్న మేఘ ఆకాష్ అయితే అఖిల్ స‌ర‌స‌న బాగుంటుంది అని ఆమెను సెలెక్ట్ చేయ‌నున్న‌ట్టు తెలిసింది. మ‌రో వైపు నితిన్ కూడా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వంలో రూపొందే చిత్రంలో మేఘ ఆకాష్ ను సెలెక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే....అఖిల్ - నితిన్ ఈ ప్రెండ్స్ ఇద్ద‌రూ ఒకే హీరోయిన్ తో న‌టిస్తుండ‌డం విశేషం..!

More News

మహేష్ - మురుగుదాస్ టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

రామ్ చరణ్ కి ప్రతిష్ఠాత్మక పురస్కారం

సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి,విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ..

డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో నాని - కీర్తిల లోక‌ల్ సెల్ఫీ 1

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కిస్తున్నారు.

భగవంతుడు అంటే ఏమిటో చెప్పిన పవన్..!

ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్.టీవీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అథ్యాత్మిక కార్యక్రమం కోటి దీపోత్సవం.

సమంతకు నితిన్ థాంక్స్.....

హీరో నితిన్,ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోనా ఇప్పుడు అతిథ్య రంగంలోకి అడుగుపెట్టారు.