close
Choose your channels

Akhil and Naga Chaitanya:అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యలు : బాలయ్యకు కౌంటరిచ్చిన అఖిల్, చైతూ.. నాగార్జునే బ్యాలెన్స్

Wednesday, January 25, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. వేదికపై హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీతో పాటు కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు చివరి వరకు సొంత అన్నదమ్ముల్లాగా మెలిగారు. ఆ తర్వాత వారి వారసులు బాలయ్య - నాగార్జునలు కూడా అలాగే అనుబంధం కొనసాగించారు. మధ్యలో ఏమైందో తెలియదు కానీ ఇద్దరికీ మాటల్లేవు. ఇలాంటి పరిస్ధితుల్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇరు కుటుంబాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి.

ఘాటుగా బదులిచ్చిన ఏఎన్ఆర్ మనవళ్లు :

బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఏఎన్ఆర్ మనవళ్లు నాగచైతన్య, అఖిల్ స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావులు తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డలన్నారు. వారిని అగౌరవ పరచడం మనల్ని మనం కించపరచుకున్నట్లేనని బాలయ్యకు చురకలంటించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి స్పందించడంపై అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే.. నాగార్జున, సుమంత్ మాత్రం ఇంకా స్పందించలేదు. వీరి నుంచి రేపో మాపో ప్రకటనలు వచ్చే అవకాశం వుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివాదానికి ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్న అభిమానులు :

మరోవైపు టాలీవుడ్‌లోని రెండు పెద్ద కుటుంబాల మధ్య వచ్చిన ఈ వివాదం త్వరగా సమసిపోవాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నారు. దీనిని ఇంకా పెద్దది చేయడం వల్ల చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బ తింటుందని పలువురు అంటున్నారు. వివాదం మొదలైంది బాలయ్య వైపు నుంచి కాబట్టి.. ఇటీవల ఓ సామాజిక వర్గం విషయంలో ఓపెన్ లెటర్ ద్వారా సారీ చెప్పినట్లుగానే, నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తులైన అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పి తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారని పరిశ్రమ పెద్దలు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

pic.twitter.com/0coiyzlkiD

— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023

pic.twitter.com/NAuvMrQZtu

— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment