Akhil Akkineni:టాలీవుడ్ హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ : 172 అడుగుల నుంచి దూకిన అఖిల్ , ‘ఏజెంట్’ ప్రమోషన్ కోసం రిస్కీ స్టంట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి పోస్టర్లు, మైకుల ద్వారా ప్రచారం చేస్తే ఇప్పుడు ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం. సోషల్ మీడియాతో ప్రచారం చేస్తూనే.. చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలి. దీనికి తోడు ఫస్ట్ లుక్, పోస్టర్, టీజర్, ట్రైలర్, వీడియో గ్లింప్స్ ఇలా కొత్త కొత్త అంశాలు వస్తున్నాయి. వీటి సాయంతోనే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి. కథ బాగున్నా పబ్లిసిటీ లేక ఎన్నో సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోగా.. కేవలం పబ్లిసిటీ స్టంట్లతోనే కలెక్షన్ వర్షం కురిపించిన సినిమాలు వున్నాయి. ఈ క్రమంలో దర్శక నిర్మాతలు కొత్త కొత్త పబ్లిసిటీ మార్గాలను వెతుకుతున్నారు.
ఇంత వరకు సాలీడ్ హిట్ లేని అఖిల్ :
ఇక అసలు విషయంలోకి వెళితే.. అక్కినేని కుటుంబంలో మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అఖిల్‌కు మాత్రం సరైన హిట్ దక్కడం లేదు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు విజయం సాధించినప్పటికీ.. చెప్పుకోగదగ్గ స్థాయిలో కమర్షియల్ హిట్ మాత్రం అఖిల్ ఖాతాలో పడలేదు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా వున్నారు అఖిల్. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. ఇందులో ఆయన గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం తనను తాను మార్చుకున్నారు అఖిల్. ఈ సినిమాలో బాడీ, హెయిర్ కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను పక్కగా ప్లాన్ చేసింది.
ఫ్యాన్స్ గుండెలు గుభేల్ :
దీనిలో భాగంగా 172 అడుగుల ఎత్తు నుంచి అఖిల్ కిందకు దూకాడు. ఇలాంటి ప్రమోషన్ టాలీవుడ్‌లోనే తొలిసారి. ఆదివారం ఏజెంట్ ప్రమోషన్స్ కోసం విజయవాడ వెళ్లిన ఆయన.. ఓ థియేటర్ పై నుంచి కిందకు రోప్ కట్టుకుని దిగుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ స్టంట్ కింద వున్న అభిమానులు హార్ట్ బీట్‌ను పెంచేసింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు ఏజెంట్ ట్రైలర్‌ను కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్‌లో లాంచ్ చేస్తామని తెలిపింది. ఇకపోతే.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ ఏజెంట్ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments