అఖిల్ టైటిల్..?
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ మూడో సినిమా జూన్ నుండి సెట్స్‌కి వెళ్లనుంది. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను లండన్‌లో 45 రోజుల పాటు చిత్రీకరించారు. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. గతంలో 'హలో' చిత్రాకి కూడా ఈ టైటిల్ వినిపించింది. కానీ అప్పుడు ఆ టైటిల్‌ను పెట్టలేదు. ఇప్పుడు మరోసారి ఈ టైటిల్ వినపడుతుంది. గతంలో నాగార్జున 'మజ్ను' టైటిల్‌తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments