లండన్‌లో పాట పాడుతున్న అఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం ‘తొలిప్రేమ’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని అక్కినేని అఖిల్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘తొలిప్రేమ’ను నిర్మించిన నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను కూడా నిర్మిస్తుండడం విశేషం.
బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం.. ప్రస్తుతం ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్ సారథ్యంలో ఓ పాటను చిత్రీకరించే పనిలో ఉంది. ఈ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రేమకథా చిత్రాలకు సంగీతమే ప్రాణం. అటువంటి సంగీతాన్ని వెంకి అట్లూరి గత చిత్రం ‘తొలిప్రేమ’కు అందించిన తమన్ ఈ సినిమాకి కూడా స్వరాలను సమకూరుస్తున్నారు. కాగా.. ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో గాని, డిసెంబర్‌లో గాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com