నా పుట్టినరోజు మీరు చేయాల్సిన పని అదే: అఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏప్రిల్ 8.. రేపు బుధవారం స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్, యూత్ కింగ్ అఖిల్ అక్కినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని అభిమానులను ఉద్దేశిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘పుట్టినరోజు అనగానే ఫ్యాన్స్ కేక్‌కటింగ్ చేయడం వంటి సెలబ్రేషన్స్ చేస్తుంటారు. ఈ సమయంలో అలా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. రేపు నా సినిమాకు సంబంధించి ఏ పోస్టర్‌ను కానీ, టీజర్‌ను కానీ విడుదల చేయడం లేదు. మా దర్శకుడు, నిర్మాత విడుదల చేద్దామని అన్నా కూడా నేనే వద్దని అన్నాను. మీ ధైర్యం, బలంతోనే మేం సినిమాలు చేస్తుంటాం. అలాంటి ధైర్యం, బలమే ఇప్పుడు మీ కుటుంబాలకు అవసరం. కాబట్టి మీరు వారితోనే ఉండండి. రేపు నా పుట్టినరోజు సందర్భంగా నేను మా ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోతున్నాను. మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీ ఫొటో తీసుకుని నాకోసం పోస్ట్ చేయండి. కరోనాపై మన దేశం కోసం, ప్రపంచం కోసం ఫైట్ చేద్దాం’’ అన్నారు.
అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com