నా పుట్టిన‌రోజు మీరు చేయాల్సిన ప‌ని అదే: అఖిల్‌

  • IndiaGlitz, [Tuesday,April 07 2020]

ఏప్రిల్ 8.. రేపు బుధ‌వారం స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్‌, యూత్ కింగ్ అఖిల్ అక్కినేని పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా అఖిల్ అక్కినేని అభిమానుల‌ను ఉద్దేశిస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. ‘‘పుట్టినరోజు అనగానే ఫ్యాన్స్  కేక్‌క‌టింగ్ చేయ‌డం వంటి సెల‌బ్రేష‌న్స్ చేస్తుంటారు. ఈ స‌మ‌యంలో అలా చేయ‌డం క‌రెక్ట్ కాదు. కాబ‌ట్టి అంద‌రూ ఇంట్లోనే ఉండాల‌ని కోరుకుంటున్నాను. రేపు నా సినిమాకు సంబంధించి ఏ పోస్ట‌ర్‌ను కానీ, టీజ‌ర్‌ను కానీ విడుద‌ల చేయ‌డం లేదు. మా ద‌ర్శ‌కుడు, నిర్మాత విడుద‌ల చేద్దామ‌ని అన్నా కూడా నేనే వ‌ద్ద‌ని అన్నాను. మీ ధైర్యం, బ‌లంతోనే మేం సినిమాలు చేస్తుంటాం. అలాంటి ధైర్యం, బ‌ల‌మే ఇప్పుడు మీ కుటుంబాల‌కు అవ‌సరం. కాబ‌ట్టి మీరు వారితోనే ఉండండి. రేపు నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నేను మా ఫ్యామిలీ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌బోతున్నాను. మీ ఫ్యామిలీతో క‌లిసి హ్యాపీ ఫొటో తీసుకుని నాకోసం పోస్ట్ చేయండి. క‌రోనాపై మ‌న దేశం కోసం, ప్రపంచం కోసం ఫైట్ చేద్దాం’’ అన్నారు.

అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

పవన్ - రవితేజ: ఈ క్రేజీ కాంబినేష‌న్ కుదిరేనా?

కొన్ని కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ అనౌన్స్‌మెంట్ ముందు నుండే భారీ అంచ‌నాలను ఏర్ప‌రుచుకుంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా రానుంద‌ని వార్త‌లు విన‌పడుతున్నాయి.

ఇలియానా షాకింగ్ డెసిష‌న్‌..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను

అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది: మహేష్ బాబు

ఈరోజు వ‌ర‌ల్డ్ హెల్త్ డే.. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. ఈ మ‌హ‌మ్మారిని త‌రిమేయ‌డానికి దేశ‌మంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించారు.

బన్నీ కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే కాలేదు.

భారత్ పెద్ద మనసు: ఎట్టకేలకు అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్..

అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.