బాబోయ్.. ఏంటి అఖిల్ జోరు.. 'ఏజెంట్' గా కిల్లింగ్ సిక్స్ ప్యాక్ లుక్

  • IndiaGlitz, [Monday,July 12 2021]

యంగ్ హీరో అఖిల్ అక్కినేని గత కొన్నిరోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాడు. అఖిల్ నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక అఖిల్ తదుపరి క్రేజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి ఇప్పటికే 'ఏజెంట్' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిపోయింది.

అయితే షూటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. బ్యాక్ సైడ్ నుంచి అఖిల్ కణాలు తిరిగిన శరీరం లుక్ ని ఆదివారం రిలీజ్ చేశారు. తాజాగా మరో పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో అఖిల్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది.

ఉక్కులాంటి కండలతో అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ లో స్టైలిష్ గా హాట్ గా ఉన్నాడు. నడుము దగ్గర ప్యాంట్ లో తుపాకీ పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో అఖిల్ యాటిట్యూడ్, స్టైల్ సింప్లీ సూపర్బ్. నేడు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశి కథ అందిస్తున్నారు. తాజాగా రిలీజైన తన లుక్ పై అఖిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ' 365 రోజుల క్రితం నన్ను నేను మెంటల్ గా, ఫిజికల్ గా ట్రాన్స్ ఫామ్ చేసుకునేందుకు సురేందర్ రెడ్డి సర్ ఛాలెంజ్ చేశారు. ఆయన రగిల్చిన ఫైర్ ఈ సినిమా మొత్తం కొనసాగుతుంది' అని అఖిల్ ట్వీట్ చేశాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. కెరీర్ ఆరంభం నుంచి సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న అఖిల్ 'ఏజెంట్' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయనడంలో సందేహం లేదు.