థాయ్లాండ్ నేపథ్యంలో అఖిల్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
'అఖిల్' చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్.. తొలి సినిమాతో ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' చేసిన ఈ యంగ్ హీరోకు.. ఆ సినిమా నటుడిగా పేరు తెచ్చినా విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయింది.
ఈ నేపథ్యంలో మూడో చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యువ కథానాయకుడు. తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ తన మూడో చిత్రాన్ని 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరితో చేయనున్నాడని తెలిసింది. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో.. అఖిల్ వెంటనే ఈ సినిమాకి ఓకే చెప్పాడని సమాచారం.
కాగా, థాయ్లాండ్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. దాదాపు 60 శాతం షూటింగును అక్కడే జరపనున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో వెంకీ, అఖిల్.. కథా విస్తరణ కోసం థాయ్లాండ్ వెళ్లినట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకి వచ్చే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments