అఖిల్ పెళ్ళిపై రూమర్స్...
- IndiaGlitz, [Wednesday,July 12 2017]
అక్కినేని అఖిల్..చేసింది ఒక సినిమా, అది కూడా ప్లాప్. కెరీర్ గాడిన పడకుండానే అఖిల్, శ్రేయాభూపాల్ను పెళ్ళి చేసుకోవాలన్నాడు. అంతా ఓకే అనుకున్నారు నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ చివరికి కొన్ని కారణాలతో పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అఖిల్ పెళ్ళి వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో అఖిల్‌కు, హీరో వెంకటేష్ కూతురుకి పెళ్ళి కానుందని రాశారు.
దీనిపై వెంటనే స్పందించిన దగ్గుబాటి ఫ్యామిలీ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. అసలు ఈ వార్త ఎలా వచ్చిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు.