అఖిల్3 పేరు ఇదే!
Send us your feedback to audioarticles@vaarta.com
`అఖిల్... ద పవర్ ఆఫ్ జువా`, `హలో` చిత్రాల తర్వాత అఖిల్ నటిస్తున్న మూడో సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. జూన్ 20 నుంచి అక్కడే షూటింగ్ జరుపుకొంటోంది. `తొలిప్రేమ`తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బీవీయస్‌యన్ ప్రసాద్ తన ఎస్‌వీసీసీ పతాకంపై రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ఓ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. అదే మిస్టర్ మజ్ను. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్ చిత్రానికి ఈ టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ భావించిందట. అందుకే అదే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
అక్కినేని అభిమానులకు తప్పకుండా 1987లో దాసరి చిత్రీకరించిన `మజ్ను` సినిమా గుర్తుకు రాకమానదు. వెంకీ అట్లూరి సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిధి అగర్వాల్ నాయిక. నాగచైతన్య నటించిన `సవ్యసాచి` ద్వారా నిధి అగర్వాల్ టాలీవుడ్ కి పరిచయమవుతోంది. నాగార్జునకు సెంటిమెంట్ నెల అయిన డిసెంబర్‌లోనే `మిస్టర్ మజ్ను`ని ప్లాన్ చేస్తున్నారు. తొలి సినిమా తొలి ప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ద్వితీయ విఘ్నం లేకుండా మరో హిట్ కొట్టడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. సినిమా మొత్తం క్లాస్ టచ్‌తో, స్టైలిష్‌గా ఉండనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com