అఖిల్ 3 అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
'అఖిల్' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన అక్కినేని అఖిల్.. తన రెండో చిత్రం హలోతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యువ దర్శకుడు వెంకీ అట్లూరితో తన మూడో సినిమా చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం యూకే బయలుదేరనుంది. రెండు నెలల పాటు అక్కడ జరిగే షూటింగ్‌తో 70 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది.
ఆ తరువాత నెల రోజుల పాటు ఇక్కడ జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాని అక్టోబర్‌లో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments