'అఖండ' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న `అఖండ` మూవీ చిత్రీకరణ పూర్తయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీకరణను పూర్తిచేసింది యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా విడుదల పోస్టర్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీదర్ షూటింగ్ విజయవంతం గా పూర్తయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు. ఈ పోస్టర్ ట్రెండింగ్ లో ఉంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో బాలయ్యను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తపాత్రలో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు బాలకృష్ణ. ఒక పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు.
బాలకృష్ణ యొక్క రెండు పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన `అఖండ ఫస్ట్ రోర్` కి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన మొదటి పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సి. రాం ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com