టాలీవుడ్‌కు మళ్లీ కళ తెచ్చిన బాలయ్య... ‘వకీల్ సాబ్’ , ‘లవ్ స్టోరీ’ రికార్డ్‌ల్ని తిరగరాసిన అఖండ
- IndiaGlitz, [Friday,December 03 2021]
కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటే సినీ పరిశ్రమను సైతం తీవ్ర కష్టాల్లోని నెట్టింది. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. ఇక షూటింగ్‌లు నిలిచిపోవడంతో రోజు వారీ కూలీపై ఆధారపడి జీవించే జూనియర్ ఆర్టిస్టులు, తదితరులు ఆకలితో అల్లాడిపోయారు. అలాగే థియేటర్లపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఓటీటీలే దిక్కయ్యాయి. చిన్నా చితకా సినిమాల వరకు పర్వాలేదు కానీ.. వందల కోట్లతో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ఈ పరిస్ధితితో ఆందోళనకు గురయ్యాయి. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలే. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ‘‘అఖండ’’ సినిమా.. టాలీవుడ్‌కు కొత్త ఊపిరిలూదింది. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా అంచనాలను అందుకుంది.
బాలయ్యను సరికొత్త గెటప్‌లో కనిపించడం, యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్స్ కారణంగా ‘అఖండ’కు తొలిరోజే అనుకున్నదానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కోవిడ్ భయంతో ఇటీవల కాలంలో థియేటర్స్ దగ్గర సందడి కరువైన సంగతి తెలిసిందే. అఖండ రాకతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద కోలాహలం కనిపించింది. ‘అఖండ’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
“అఖండ” ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :
నైజాం – రూ. 4.39 కోట్లు
సెడెడ్ – రూ. 4.02 కోట్లు
యూఏ – రూ. 1.36 కోట్లు
గుంటూరు – రూ. 1.87 కోట్లు
తూర్పు- రూ. 1.05 కోట్లు
వెస్ట్ – రూ. 0.9 కోట్లు
కృష్ణ – రూ. 0.81 కోట్లు
నెల్లూరు – రూ. 0.93 కోట్లు
ఆంధ్రా, తెలంగాణ మొత్తం షేర్ – రూ. 15. 39 కోట్లు (రూ.23 కోట్లు గ్రాస్)
ప్రపంచవ్యాప్తంగా షేర్ – రూ. 18.04 కోట్లు
ఇక ప్రీమియర్ షోల ద్వారా నార్త్ అమెరికాలో అఖండ చిత్రం 325K డాలర్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇదే హైయెస్ట్. శేఖర్ కమ్ముల, నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రం సాధించిన వసూళ్లను అఖండ మూవీ బ్రేక్ చేసింది. లవ్ స్టోరీ చిత్రం 313K డాలర్లతో రెండవ స్థానంలో.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 300K డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నాయి.