Akbaruddin Owaisi: తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభాకానున్నాయి. నాలుగురోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికలైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేశారు. ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణం.. తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. తదుపరి గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది.
శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అక్బరుద్దీన్ కు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం అనంతరం అక్బరుద్దీన్ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత శనివారం సాయంత్రం స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపికయ్యారు.
కాగా కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 39, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంఛనమే కానుంది. అయితే డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ ఎన్నిక జరిగే వరకు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout