Akbaruddin Owaisi:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ

  • IndiaGlitz, [Friday,December 08 2023]

రేపటి(శనివారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. దీంతో అసెంబ్లీ తొలి సమావేశాల ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ నియమితులయ్యారు. శనివారం ఉదయం 8.30గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ఆయన ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. నిబంధనల ప్రకారం ఆయనే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ కాలుజారి పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయన తర్వాత మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, అక్బరుద్దీన్ ఒవైసీలు ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ ఉత్తమ్, తుమ్మల మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక మిగిలిన వారిలో అక్బరుద్దీన్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇందుకు ఒవైసీ కూడా అంగీకరంచడంతో ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యారు.

కాగా అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌‌ను ఇప్పటికే కాంగ్రెస్‌ ఎంపిక చేసింది. కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 39, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంఛనమే కానుంది. అయితే డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేది శనివారం తేలనుంది.

More News

Former CM KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు సొంతింటి కష్టాలు.. ఎక్కడుండాలి..?

ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు సీఎం హోదాలో అధికార దర్పం ప్రదర్శించిన కేసీఆర్‌కు

KCR: కేసీఆర్ హెల్త్‌బులిటెన్ విడుదల.. ఏం చెప్పారంటే..?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌తో పాటు ఇతర సినీ,

Pawan Kalyan:సీఎం పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

సీఎం పదవిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగసభలో

CM Revanth Reddy:ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగానే ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని