సామాన్యుడి శక్తిని చాటే 'ఆకాశం నీ హద్దురా'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆవేశం అందరికీ ఉంటుంది.. కానీ ఆలోచనతో ముందుకు సాగడం కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఆవేశం, ఆలోచన కలిస్తే ఏమవుతుంది. అద్భుతాలు జరుగుతాయి. దీనికి ఉదాహరణ ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథన్ జీవిత చరిత్ర. గోపీనాథన్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రాసిన పుస్తకం 'సింప్లి ఫై'కు కల్పిత వెర్షన్‌గా తెరకెక్కిన సినిమాయే 'శూరరై పోట్రు'. దీన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదల చేస్తున్నారు. ఓటీటీ మాధ్యమంలో నవంబర్ 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. గురు(ఇరండాం సుట్రు) ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, గునీత్ మోంగ, ఆలీఫ్ సుర్తి నిర్మించారు.
"ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. హృదయానికి హత్తుకుంది. నిజంగా నిన్ను నమ్మి పనిలో అంకితమైతే ప్రపంచంలో ఏదీ నీకలలను నిరోధించకుండా ఆపలేదు అని చెప్పే ప్రయత్నాన్ని ఈ చిత్రంలో చేశాం" అన్నారు హీరో, నిర్మాత సూర్య. అపర్ల బాల మురళి హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. కరోనా కారణంగా థియేటర్స్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సూర్య ఈ చిత్రాన్ని డిజిటల్ మాధ్యమంలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఓటీటీలో అక్టోబర్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout