Akash Puri: పూరీ జగన్నాథ్ దంపతుల విడాకుల వార్తలు... తేల్చేసిన ఆకాశ్ పూరీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్యలు విడిపోతున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్‌లలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ తనయుడు, యువ హీరో ఆకాశ్ పూరీ రంగంలోకి దిగారు. ఇటీవల ఆయన నటించిన చోర్ బజార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఆకాశ్ పూరీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల విడాకుల రూమర్స్‌పై ఆయన స్పందించారు. అవన్నీ అవాస్తవాలని.. ప్రస్తుతం తామంతా ఎంతో సంతోషంగా వున్నామని ఆకాశ్ పూరీ చెప్పారు. పనీ పాట లేని కొంతమంది ఇలాంటి వార్తలను సృష్టించారంటూ తేల్చేశారు ఆకాశ్.
చేతిలో రూ.200.. లేచిపోదామని ఫోన్ :
అంతేకాదు తన తల్లిదండ్రుల ప్రేమ, వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన పంచుకున్నారు. ఒకానొక దశలో తమ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొందని.. తమ ఆస్తులన్నీ పోయి ఇల్లు, కార్లు అమ్మేశారని ఆకాశ్ పూరీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్ధితి నుంచి ఇక్కడిదాకా రావడానికి అమ్మే కారణమని ఆయన చెప్పారు. ప్రతి ఇబ్బందిలోనూ అమ్మ అండగా వుండటం వల్లే నాన్న కోలుకున్నారని తెలిపారు. మా అమ్మను ప్రేమించిన నాన్న .. నువ్వంటే నాకిష్టమని, నీకు ఓకే అయితే వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పారని ఆకాశ్ అన్నారు. అప్పుడు నాన్న దగ్గర కేవలం రూ.200 మాత్రమే వున్నాయని.. రేపు ఎలా వుంటుందో తెలియదని చెప్పారని, దానికి అమ్మ ఏమాత్రం కంగారు పడకుండా వచ్చేస్తానని చెప్పిందని ఆకాశ్ తెలిపాడు. ఈ విషయాన్ని నాన్న చెప్పినప్పుడు విని ఆశ్చర్యపోయానని వ్యాఖ్యానించాడు.
చోర్ బజార్‌పైనే ఆశలు:
ఇకపోతే.. మెహబూబా సినిమాతో హీరోగా మారిన ఆకాశ్ పూరి.. ఇటీవల రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆకాశ్ పూరీ ‘‘చోర్ బజార్’’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments