పూరి తనయుడిని పట్టించుకుంటారా!!
Send us your feedback to audioarticles@vaarta.com
పూరి తనయుడు ఆకాశ్ పూరి బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. తర్వాత హీరోగా కూడా మెహబూబా చిత్రంతో పరిచయం అయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో పూరి ఇప్పుడు రొమాంటిక్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల రొమాంటిక్ సినిమా హోల్డ్‌లో పడింది. అయితే ఇప్పుడు తను అవకాశాలు కోసం ఇతర దర్శకులను ఏమాత్రం సంకోచించకుండా అడుగుతున్నాడు. అందుకు తను ఓ ఉపాయం ఆలోచించాడు. తండ్రి పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో డైలాగ్స్ అన్నింటినీ కలిపి మరో హీరో, స్నేహితుడు రాహుల్ విజయ్‌తో ఓ వీడియో రూపొందించాడు.
పూరి సినిమాలు ఇడియట్, బుజ్జిగాడు, పోకిరి, బిజినెస్‌మేన్...ఇలా పలు చిత్రాల్లో ఫేమస్ అయిన డైలాగ్స్‌ను కలిపి రూపొందించిన వీడియోను ఆకాశ్ పూరి ట్వీట్ చేశాడు. ఈ వీడియో బావుందంటూ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. పూరి సైతం ఆకాశ్, రాహుల్ విజయ్‌ను అభినందించాడు. వీడియో బావుందంటూ డైరెక్టర్ అనీల్ రావిపూడి కూడా ట్వీట్ చేశాడు. దీనిపై ఆకాశ్ పూరి స్పందిస్తూ ఖడ్గం సినిమాలో డైలాగ్ ఒక్కఛాన్స్ ప్లీజ్ గుర్తుంచుకోండి అంటూ ఓ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. మరి హీరోగా ప్రయత్నాలు చేస్తున్న ఆకాశ్ పూరి రిక్వెస్ట్‌ను ఇతర దర్శకులెవరైనా పట్టించుకుంటారేమో చూడాలి.
Superb abbayilu.....iddaru chimpesaru????????... https://t.co/kJsXib42AK
— Anil Ravipudi (@AnilRavipudi) May 17, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments