నటుడిగా ప్రతి సినిమాకు నేర్చుకుంటూనే ఉన్నాను - ఆకాశ్ పూరి
Send us your feedback to audioarticles@vaarta.com
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మే 11న సినిమా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా...
ఆకాశ్ పూరి మాట్లాడుతూ - `` మే 11న `మెహబూబా` విడుదలవుతుంది. ఈ మూమెంట్ కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 15 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అందరూ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. మా నాన్నగారి లవ్‌స్టోరీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే ఈ లవ్‌స్టోరీ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. మా నాన్న నుండి ఇలాంటి లవ్‌స్టోరీ ఊహించలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్‌స్టోరీ ఇన్ టాలీవుడ్ అవుతుంది. కాలేజీ లవ్‌స్టోరీ కాదు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియా అబ్బాయి, పాకిస్థాన్ అమ్మాయి మధ్య సాగే సినిమా. ఆర్మీ బ్యాక్‌డ్రాప్ అనగానే నేను సెట్ అవుతానా అనిపించింది.
అలాగే చాలా రీసెర్చ్ చేశాను. వారెలా మాట్లాడుతారు. ఎలా నడుస్తారు. ఎలా సెల్యూట్ చేస్తారు అని చూసుకున్నాను. కాస్త టైమ్ పట్టింది. నాన్న క్యారెక్టర్ చెప్పిన తర్వాత దానికి తగినట్టు ట్రై చేస్తాను. హీరోగా నా డెబ్యూ కాబట్టి నన్ను ఎక్కడో పెద్దగా చూపించలేదు. స్టోరీ ప్రకారం నా రోల్ చాలా నేచురల్‌గా ఉంటుంది. పూర్వ జన్మల నేపథ్యాలంటే నమ్మేవాణ్ణే. అయితే నా సినిమాకు అలాంటి కాన్సెప్ట్ వస్తుందని అనుకోలేదు. నేను చిన్నప్పుడు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో కొత్తగా ఉంటాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాప్రతి సినిమాకు నేర్చుకుంటూనే ఉంటాను. సినిమా చూసిన వారందరూ మీ నాన్నగారి స్టైల్‌కు డిఫరెంట్‌గా ఉందన్నారు. అలా అన్నారు కాబట్టే మా నాన్నను నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నానని చెప్పగలిగాను.
నేను పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో.. ఓ బాధ్యత గల యువకుడుగా కనపడతాను. పాకిస్థాన్ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి పాకిస్తాన్‌కు కూడా వెళతాడు. ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. రియల్ సతీశ్‌గారు చాలా బాగా ఫైట్స్ చేయించారు. పూర్వ జన్మల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఏ సినిమాలో లేని ఓ పాయింట్ ఈ సినిమాలో కనపడుతుంది. దేవుడి దయ వల్ల దాదాపు అందరి స్టార్స్‌తో పని చేశాను. అయితే ఓ ఒక్కరినో టార్గెట్‌గా పెట్టుకుని పనిచేయలేదు. నాకు రజనీకాంత్‌గారంటే పిచ్చి. ఆయన నాకు దేవుడు. ఇన్‌స్పిరేషన్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకు తగిన విధంగా నేహాశెట్టి అద్భుతంగా నటించింది. నెక్ట్స్ మూవీ కూడా మా నాన్నతోనే ఉంటుంది. ప్రస్తుతం స్టోరీ రెడీ అవుతుంది. వివరాలను అనౌన్స్ చేస్తాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments