23 ఏళ్ల బంధం ముగిసింది.. ఎన్డీయేకు శిరోమనీ అకాలీదళ్ గుడ్ బై..
Send us your feedback to audioarticles@vaarta.com
సుదీర్ఘ ప్రయాణం.. అర్థంతరంగా ముగిసింది. ఎన్డీఏ, శిరోమనీ అకాలీదళ్ల మధ్య వ్యవసాయ బిల్లులు చిచ్చు పెట్టాయి. దీంతో 23 ఏళ్ల రాజకీయ బంధాన్ని శిరోమనీ అకాలీదళ్ తెంచేసుకుంది. శనివారం పార్టీ ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం దాదాపు మూడు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలోనే అకాలీదళ్ పెద్దలంతా కలిసి జేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు.
కేంద్రం తీసుకొచ్చిన బిల్లుల ప్రభావం రైతులపై తీవ్రంగా పడిందని... కేవలం రైతులే కాదు... వ్యవసాయంపై ఆధారపడే దళితులు, రైతు కూలీలు.. అందరిపై ప్రభావం పడిందని... అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ తీసుకొచ్చిన బిల్లులు రైతులకు ప్రాణాంతకమే కాకుండా వినాశకరమైనవని పేర్కొన్నారు. ఈ వ్యవసాయ బిల్లులను తాము సభలో సైతం వ్యతిరేకించామన్నారు. ఈ బిల్లులు నేరుగా రైతులకు, రైతు కూలీలకు నష్టం చేస్తాయని పేర్కొన్నారు. తమ అభిప్రాయాలకు బీజేపీ విలువనివ్వలేదని అయినప్పటికీ కేంద్రాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామని అయినా వినడం లేదని బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు తమ పంటను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించిందని బాదల్ పేర్కొన్నారు. జమ్మూలో పంజాబీని రెండో అధికార భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలను నిరసిస్తూ ఎన్డీయే కూటమి నుంచి బయటకి రావాలి నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు పంజాబ్ ప్రజానీకంతో పాటు.. పార్టీ కార్యకర్తలు, రైతులు, ట్రేడర్స్ అందరితో చర్చించామని వెల్లడించారు. తమ పార్టీ మూల సిద్ధాంతాలకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments