ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో మరో సూపర్ హిట్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయల్ జంటగా వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` మార్చి 3న విడుదలై సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజ్ తరుణ్ తనదైన స్టయిల్‌లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌ను ఫుల్ ఎనర్జితో క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే విడుదలైన తొలి ఆట నుండే అన్నీ ఏరియాల నుండి సూపర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చూపిస్తూ హీరో రాజ్ తరుణ్ కెరీర్‌లోనే హాయ్యస్ట్ కలెక్షన్స్‌తో టాప్ మూవీగా నిలిచింది.
కుక్కల కిడ్నాపర్‌గా రాజ్ తరుణ్ నటన, అను ఇమ్మాన్యుయల్ గ్లామర్, రాజ్‌తరుణ్- అను ఇమ్మాన్యుయల్ మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఎంటర్‌టైనింగ్ విషయంలో రేచీకటి రేచీగా థర్టీ ఇయర్స్ పృథ్వీ నటన హైలైట్‌గా నిలిచింది. క్లైమాక్స్‌లో ఎంటర్‌టైనింగ్ పార్ట్, సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. పృథ్వీ నటనతో పాటు రఘబాబు, వెన్నెలకిషోర్, ప్రవీణ్, సుదర్శన్, నల్ల వేణు, ఫిష్ వెంకట్, సామ్రాట్ తదితరుల కామెడి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ పాత్ర వైవిధ్యత సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. డైరెక్టర్ వంశీకృష్ణ ప్రతి సన్నివేశాన్ని హిలేరియస్ గా తెరకెక్కించిన విధానం ప్రశంసలు అందుకుంటుంది.
గతేడాది రాజ్ తరుణ్ హీరోగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన ఈడోరకం-ఆడోరకం సూపర్‌హిట్ తర్వాత ఈ ఏడాది `కిట్టుఉన్నాడు జాగ్రత్త`తో మరో సూపర్‌డూపర్‌హిట్ కొట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments