రీమేక్ కాదు.. డబ్బింగే
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రం 'వేదాళం'. అజిత్, శ్రుతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి 'శౌర్యం' శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని రీమేక్ చేసే అవకాశముందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే 'ఊసరవెల్లి' ఫీచర్స్‌తో ఉండే ఈ సినిమాని రీమేక్ చేయడం కంటే డబ్బింగ్ చేయడమే బెటర్ అనే అభిప్రాయాలు వెలువడ్డాయి.
దీంతో.. ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాని.. ఓ మంచి ముహుర్తం చూసుకుని విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెలువడతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments