అజిత్ తెలుగు టైటిల్ ఫిక్సయింది...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న తమిళ చిత్రం వేదాళం`. ఈ చిత్రాన్ని తెలుగులో అవేశం` అనే పేరుతో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సూర్యామూవీస్ అధినేత ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని తెలుగులో దీపావళి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
మరి ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని తెలుగులో డైరెక్ట్ గా విడుదల చేస్తారో లేక మరెవరికైనా ఈ చిత్రాన్ని అమ్మేస్తారో చూడాలి. శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గజరాజు` హీరోయిన్ లక్ష్మీమీనన్ ఈ చిత్రంలో అజిత్ చెల్లెలుగా నటిస్తుంది. తమిళంలో విడుదలైన ట్రైలర్ రికార్డు స్థాయిలో క్లిక్స్ ను సాధించింది. అజిత్ గత చిత్రం తెలుగులో ఎంతవాడు గానీ` పేరుతో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. మరి ఇప్పుడు అవేశం సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com