అజిత్ తదుపరి చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో అజిత్ తదుపరి చిత్రం ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన పింక్ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. హిందీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తమిళంలో అజిత్ పోషించబోతున్నారు.
చతురంగ వేట్టై, ఖాకి చిత్రాల దర్శకుడు హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం మహిళలపై జరుగతున్న అఘాయిత్యాలపై ఈ పింక్ సినిమా ఉంటుంది. తాప్సీ మరో కీలక పాత్రలో నటించారు.
మరి తమిళంలో తాప్పీ పాత్రను ఎవరు చేస్తారనేది ఇంకా తెలియడం లేదు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిదే. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను ప్రకటిస్తారు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com