కార్తీ డైరెక్టర్ తో అజిత్ చిత్రం?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్రాలతో కెరీర్ను ప్రారంభించి.. తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్. ఆయన నటిస్తున్న 58వ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే తన 59వ చిత్రాన్ని కూడా అజిత్ లైన్లో పెట్టేశారని కోలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. ఇటీవల కార్తితో 'ధీరన్ అధిగారం ఒండ్రు' (తెలుగులో 'ఖాకి') సినిమా రూపొందించి.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు హెచ్.వినోద్. ఈ సినిమాను చూసిన అజిత్.. డైరెక్టర్ టేకింగ్ నచ్చిందని.. బాగా చేశారని కొనియాడారు. అవకాశం వస్తే వినోద్ దర్శకత్వంలో నటించాలని ఉందని బాహాటంగానే ప్రకటించారు అజిత్. దీంతో అజిత్ 59వ చిత్రాన్ని వినోద్ తెరకెక్కిస్తున్నారనే వార్తలు నిజమనిపిస్తున్నాయి.
నిజానికి 2014లో వినోద్ తొలి చిత్రం 'సతురంగవేట్టై' సినిమా విజయం సాధించిన నేపథ్యంలోనే.. అజిత్ కాంబినేషన్లో ఓ చిత్రం చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వలన అప్పుడు వీలు పడలేదు. మరి ఇప్పుడైనా కార్యరూపం దాల్చుతుందేమో చూడాలి. ఇదిలా వుంటే.. మరో స్టార్ హీరో విజయ్ 63వ చిత్రానికి కూడా వినోద్ దర్శకత్వం వహించబోతున్నారని కోలీవుడ్లో కాస్త గట్టిగానే ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు ప్రాజెక్టులపై వినోద్ ఏమంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments