స్టార్ హీరో అజిత్‌కు షూటింగ్లో ప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన ‘వలిమై’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్లో భాగంగా బైక్‌తో రిస్కీ స్టంట్స్ చేస్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అజిత్ చేతికి, కాళ్లకు గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల పాటు అజిత్ షూటింగ్‌కు విరామం తీసుకోనున్నారు.
‘వలిమై’ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న బైక్ చేజింగ్ సీన్స్‌ను అజిత్ డూప్ లేకుండా చేస్తున్నారు. చాలా రిస్కీ స్టంట్స్ కావడంతో ప్రమాదానికి గురైంది. కాగా.. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వలిమై’ చిత్రానికి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హూమా ఖురేషి.. అజిత్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com