అజిత్ వాలిమై కొత్త రిలీజ్ డేట్.. పవన్ బరిలోకి దిగితే కష్టమే..!!

  • IndiaGlitz, [Wednesday,February 02 2022]

ఏ సినిమా చేసినా ప్రాణం పెట్టి చేయడం అజిత్ స్టైల్. తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకడిగా వున్నా... నేటికీ ఆయనలో అదే క్రమశిక్షణ, పట్టుదల. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ‘వాలిమై’. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ నటి హ్యుమా ఖురేషి అజిత్‌తో ఆడిపాడనుండగా.. తెలుగు యువనటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హాలీవుడ్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించారని కోలీవుడ్ టాక్.

తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 13న వాలిమైను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కోవిడ్ మహమ్మారి వారి ఆశలపై నీళ్లు చల్లింది. అప్పుడు దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్ధితుల కారణంగా వాలిమై రేసు నుంచి వెనక్కి తగ్గింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉద్ధృతి కాస్తంత తగ్గడంతో మళ్లీ పరిస్దితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాలిమై మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 24న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

అయితే వాలిమై రిలీజైన మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 25న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది. కాకపోతే.. ఏప్రిల్ 1ని కూడా భీమ్లా నాయక్ లాక్ చేసి పట్టుకోవడంతో ఏ రోజు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటి లేదు. ఒకవేళ ఫిబ్రవరి 25న దిగితే మాత్రం.. వాలిమైకి గట్టి పోటీ తప్పదు.

More News

విఘ్నాలు దాటుకుని.. ఫిబ్రవరి 18ని లాక్ చేసిన ‘'సన్ ఆఫ్ ఇండియా'

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు మోహన్ బాబు. అడపా దడపా గెస్ట్ రోల్స్ చేయడమే తప్పించి..

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

ఆర్ఆర్ఆర్‌ రిలీజ్ విషయంలో క్లారిటీ రావడంతో టాలీవుడ్‌లో పెద్ద కదలిక వచ్చింది. చిన్నా, పెద్దా సినిమాలు ఒకదాని వెంట మరొకటి కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి.

చివరి షెడ్యూల్‌ జరుపుకుంటున్న జీ5 'గాలివాన' వెబ్‌ సిరీస్‌

‘జీ 5’... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల

'పంచతంత్రం'లో కథా బ్రహ్మ బ్రహ్మానందం క్యారెక్టర్ టీజర్ విడుదల

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'పంచతంత్రం'.

చీప్ యాక్టర్‌‌తో పోల్చొద్దంటూ పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లకు టార్గెట్‌గా మారుతున్నారు సెలబ్రిటీలు. చిన్న పోస్ట్ చేయడం పాపం.. అయినదానికి కానిదానికి వాళ్లను ట్రోల్ చేస్తున్నారు.