షూటింగ్‌లో అజిత్‌కు గాయాలు

  • IndiaGlitz, [Wednesday,February 19 2020]

కోలీవుడ్ అగ్ర క‌థానాయకుడు అజిత్ ప్ర‌స్తుతం త‌న 60వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఖాకి ద‌ర్శ‌కుడు హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్ నిర్మాత‌గా 'వ‌లిమై' అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా చెన్నై షెడ్యూల్ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ చెన్నై షెడ్యూల్‌లో బైక్ చేజింగ్ సీన్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా బైక్ స్కిడ్ అయ్యి అజిత్ క్రింద ప‌డ్డాడు. చిన్న‌పాటి గాయాలు కూడా అయ్యాయి. ఓ అర‌గంట పాటు రెస్ట్ తీసుకున్న హీరో అజిత్ స‌ద‌రు యాక్ష‌న్ సీన్‌ను పూర్తి చేసిన త‌ర్వాతే హాస్పిట్‌కు వెళ్లాడ‌ట‌. డాక్ట‌ర్స్ కొన్ని రోజుల పాటు రెస్ట్‌ను సూచించారు. రెస్ట్ తీసుకున్న త‌ర్వాత అజిత్ త‌దుప‌రి షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు.

బాలీవుడ్ చిత్రం పింక్‌ను త‌మిళంలో వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో నేర్కొండ‌పార్వై పేరుతో తెర‌కెక్కించారు. ఇప్పుడు అదే కాంబినేష‌న్‌లోనే మ‌రో సినిమాస్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.