పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజిత్
Send us your feedback to audioarticles@vaarta.com
అజిత్ 60వ సినిమా కోసం రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఖాకి` చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి అజిత్ ఇప్పటికే వర్కవుట్స్ ప్రారంభించారని టాక్. ఈ సినిమాలో అజిత్ కార్ రేసర్‌గా కనపడతారని వార్తలు వినిపించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా కనపడతారని తమిళ సినీ వర్గాలంటున్నాయి. సాధారణంగా తన సినిమాల్లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనపడే అజిత్ తన 60వ సినిమా కోసం లుక్ మార్చుకుంటున్నాడట. అందులో భాగంగా బ్లాక్ హెయిర్‌తో పాటు సన్నబడుతున్నాడట.
రీసెంట్గా అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన `నేర్కొండ పార్వై` చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించాడు. ఆ క్రమంలో వినోద్ చెప్పిన కథ నచ్చడమూ.. బోనీ కపూర్‌తో మరో సినిమా చేసే కమిట్మెంట్ ఉండటంతో అజిత్ వెంటనే తన కొత్త ప్రాజెక్ట్‌కు ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడట. ఇది వరకు ఆంజనేయ, గ్యాంబ్లర్(మంగాత్తా), ఎంతవాడుగానీ(ఎన్నైఅరిందాల్) చిత్రాల్లో అజిత్ పోలీస్‌గా నటించాడు.
రీసెంట్ సినిమా నేర్కొండ పార్వై బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తమిళంలో అజిత్ పోషించారు. విద్యాబాలన్, శ్రద్ధాశ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రీమేక్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అజిత్ అభిమానులు ఆయన తదుపరి సినిమాపై మరింత అంచనాలను పెంచుకున్నారు. మరి దర్శకుడు వినోద్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడోననే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments