అభిమానుల అత్యుత్సాహం.. అజిత్ ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ స్టార్ హీరోలంతా తమకు కేటాయించిన పోలింగ్ బూతుల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజిత్ తన భార్య షాలినీతో కలిసి తిరువాన్మయూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఓటు వేసి బయటకు వచ్చిన హీరో అజిత్‌తో సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఇబ్బందిపడిన అజిత్ ఓ అభిమాని సెల్‌ఫోన్ లాక్కుని తన జేబులో పెట్టుకున్నారు. అనంతరం అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అభిమానులపై అజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసహనానికి గురైన అజిత్..
ఎన్నికల పోలింగ్ సమయంలో చాలా కూల్‌గా లైన్‌లో వేచి ఉండి మరీ అజిత్ ఎప్పుడూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు. అలాంటి అజిత్ నేడు అభిమానుల తీరు కారణంగా తీవ్ర అసహనానికి గురయ్యారు. అసలు మనం ఎక్కడున్నాం.. ఎలాంటి పేండమిక్ సిట్యువేషన్‌లో ఉన్నామనే వాటితో పని లేకుండా అభిమానులు.. అజిత్‌తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఓటు ఇక సామాన్యుడిలా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అజిత్ క్యూలైన్‌లో నిలుచున్నారు. ఈ పోలింగ్ సందర్భంగా కోలీవుడ్ అగ్రహీరోలు పోలింగ్ బూత్‌కి వచ్చిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
చర్చనీయాంశంగా అజిత్ మాస్క్.. విజయ్ సైకిల్
అజిత్ ధరించిన మాస్క్ చర్చనీయాంశంగా మారింది. అలాగే స్టార్ హీరో విజయ్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు సైకిల్‌పై వచ్చాడు. అజిత్ మాస్క్, విజయ్ విజయ్ ఉపయోగించిన సైకిల్ ఒకే రంగుల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండూ నలుపు, ఎరుపు రంగుల్లో ఉన్నాయి. అందుకని వీరిద్దరూ డీఎంకే పార్టీకి ఓటేయమని సంకేతాలు ఇస్తున్నారని పలువురు భావించగా.. ఇక డీఎంకే నేతలైతే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసేసుకున్నారు. దేశంలో తీవ్రంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా విజయ్ అలా సైకిల్‌పై వచ్చాడని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయమంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారనే చర్చ భారీగానే జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments